ముద్దిస్తే మార్కులేస్తానని బ్లాక్‌మెయిల్ చేసిన ప్రొఫెసర్ అరెస్ట్
- ఓ జూనియర్ కాలేజీలో చదువుతోన్న బాధిత విద్యార్థిని
- ప్రొఫెసర్ ముద్దు డిమాండ్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన వైనం
- తల్లిదండ్రుల ఒత్తిడితో వివరాల వెల్లడి...పోలీసు కేసు
తమ కుమార్తె కొన్ని రోజులుగా ముభావంగా ఉండటంతో ఆమె తల్లిదండ్రులు ఏం జరిగిందో చెప్పాలంటూ ఆమెను ప్రశ్నించారు. దాంతో జరిగిన విషయాన్ని ఆమె పూసగుచ్చినట్లు వారికి వివరించింది. ఇదే విషయాన్ని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ కేసులో నిందిత ప్రొఫెసర్‌పై సత్వర చర్యను తీసుకునే విధంగా మద్దతు కోసం వారు సోషల్ మీడియాలోనూ ప్రచారం చేశారు. ఫలితంగా నిందితుడిపై ఐపీసీతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.