వివాహితుడితో ఏ మహిళైనా హోటల్ కు వెళ్తుందా?: షమీ భార్య హసీన్
- అలీషబా నా వైవాహిక జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తోంది
- అలీషబా నా భర్త స్నేహితురాలు, అభిమాని కాదు
- వివాహితుడితో ఏ మహిళ అయినా పడకగదిని పంచుకుంటుందా?
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన భర్తకు వివాహేతర సంబంధాలు చాలా ఉన్నాయని అన్నారు. పాకిస్థానీ యువతి అలీషబా తన వైవాహిక జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అలీషబా షమీ స్నేహితురాలు కానీ, అభిమాని కానీ కాదని ఆమె స్పష్టం చేశారు. వివాహమైన వ్యక్తితో ఏ మహిళ అయినా హోటల్ లో గడుపుతుందా? అని ఆమె ప్రశ్నించారు. అతని పడకగదిని పంచుకుంటుందా? అని ఆమె నిలదీసింది.