charan: 'రంగస్థలం' విషయంలో చిరూ సూచన .. చరణ్ నమ్మకం

షార్ట్స్‌లో చూడండి
సుకుమార్ దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా 'రంగస్థలం' చిత్రం రూపొందింది. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 30వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఫిల్మ్ నగర్లో ఒక టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా నిడివి 5 పాటలతో కలుపుకుని 2 గంటల 45 నిమిషాల సేపు ఉందట.

నిడివి చాలా ఎక్కువగా ఉందనే అభిప్రాయాన్ని చిరంజీవి వ్యక్తం చేశారట. ఇప్పుడున్న ట్రెండ్ లో గ్రామీణ నేపథ్యంతో కూడిన కథను ఇంత పెద్ద నిడివితో పట్టుగా నడిపించడం చాలా కష్టమని అన్నారట. అయితే చరణ్ మాత్రం కంటెంట్ పై గట్టి నమ్మకంతో వున్నాడని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ తరహా సినిమా రాకపోవడం తమకి బాగా ప్లస్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడని చెబుతున్నారు. ఇలా చిరంజీవి తన అనుభవంతో చరణ్ కి సూచించినా, ఇంతవరకూ వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకుని చరణ్ ముందుకు వెళుతున్నాడట. చరణ్ నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.   
Go Back to Shorts
charan
samanta

More Telugu News