పవన్ కల్యాణ్ ను జనం నమ్మకపోవడానికి కారణం ఇదే: గద్దె రామ్మోహన్
- ఎవరో చెబితే లోకేష్ ను విమర్శించారు
- పవన్ యూటర్న్ ను చూసి ఆ పార్టీ కార్యకర్తలే ఆశ్చర్యపోయారు
- కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి కూడా పడుతుంది
ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని రామ్మోహన్ అన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా... రాష్ట్రాన్ని సమర్థవంతంగా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పాలిస్తున్నారని చెప్పారు. విభజన హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి కూడా పడుతుందని అన్నారు.