వైసీపీ వైఖరి చూస్తుంటే మొక్కుబడిగానే కనిపిస్తోంది: మల్లికార్జున ఖర్గే

షార్ట్స్‌లో చూడండి
కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉన్నట్టు ఎంతమాత్రమూ కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అవిశ్వాసం విషయంలో ఆ పార్టీ శైలి మొక్కుబడిగా కనిపిస్తోందని ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన అభిప్రాయపడ్డారు.

ఏపీకి ప్రత్యేక హోదాకు మొదటి నుంచి కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని, తాము అధికారంలోకి వస్తే, తొలి సంతకం హోదాపైనే ఉంటుందని తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టంగా చెప్పారని వ్యాఖ్యానించారు. అన్ని ప్రతిపక్ష పార్టీలనూ సమన్వయం చేసుకునే ఉద్దేశం వైసీపీకి లేదని, తాము యూపీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించి, ఈ అవిశ్వాసంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Go Back to Shorts
Congress
YSRCP
Mallikarjuna Kharge

More Telugu News