దారుణం! పరీక్షలు వేరే విద్యార్థితో రాయిస్తానని నమ్మించి పదో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారం

  • ఇద్దరు మహిళల సాయంతో బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచారం
  • పోస్కో చట్టం కింద ముగ్గురిపైనా కేసు నమోదు
  • పరారీలో నిందితులు.. గాలిస్తున్న పోలీసులు
పదో తరగతి వార్షిక పరీక్షలను వేరే విద్యార్థితో రాయించి పాస్ చేయిస్తానని నమ్మించి ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. చండీగఢ్‌లోని సోనిపట్ జిల్లా గొహనా పట్టణంలో జరిగిందీ ఘటన.

బాలికను నమ్మించి అత్యాచారానికి ఒడిగట్టిన స్కూలు ప్రిన్సిపాల్ సహా అతడికి సహకరించిన ఇద్దరు మహిళలపై పోలీసులు పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వీరు ముగ్గురూ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

బాధిత బాలిక తండ్రి మాట్లాడుతూ తన కుమార్తెను పరీక్షల్లో ఉత్తీర్ణత చేసేందుకు ప్రిన్సిపాల్‌తో రూ.10వేలకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. మార్చి 8న ప్రిన్సిపాల్ తనకు ఫోన్ చేసి కుమార్తెతో కలిసి రావాల్సిందిగా కోరారని, అక్కడికి వెళ్లాక ఆమె పరీక్షలు రాయాల్సి ఉంది కాబట్టి తనను వెళ్లమని చెప్పారని బాలిక తండ్రి పోలీసులకు తెలిపారు. పరీక్ష రాసిన తర్వాత ఇంటికొచ్చిన కుమార్తె ప్రిన్సిపాల్ తనను రేప్ చేశాడని చెప్పిందని, ఇద్దరు మహిళలు తనను ఒప్పించారని చెప్పినట్టు బాలిక తండ్రి తెలిపారు. బాలిక వాంగ్మూలం అనంతరం పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. కాగా, రెండు నెలల్లో  ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి.
Go Back to Shorts
Chandigarh
Rape
Student
principal
School

More Telugu News