Pawan Kalyan: పవన్‌వి మతిలేని మాటలు.. నాలుగేళ్లలో కనిపించని అవినీతి ఇప్పుడే కనిపించిందా?: మంత్రి జవహర్
టీడీపీలో అవినీతి భారీ స్థాయిలో పెరిగిపోయిందని, మంత్రి నారా లోకేశ్ అవినితికి అంతే లేకుండా పోయిందంటూ జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కేఎస్ జవహర్ ఘాటుగా స్పందించారు. పవన్ మతిలేకుండా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. గత నాలుగేళ్లుగా కనిపించని అవినితి పవన్‌కు ఇప్పుడే కనిపించిందా? అని ప్రశ్నించారు. బీజేపీతో పవన్ లోపాయికారీగా ఒప్పందం కుదుర్చుకున్నారని, అదేంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తానని పవన్ వ్యాఖ్యలను మంత్రి జవహర్ స్వాగతించారు. ఆయన నిరాహార దీక్షకు తమ మద్దతు ఉంటుందన్నారు. విశాఖపట్టణంలో భూకబ్జాలు జరిగినట్టు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు చెప్పారా? అని నిలదీశారు. వనజాక్షి కేసులో ఎమ్మెల్యే తప్పులేదని స్వయంగా ఆమెనే చెప్పారని గుర్తు చేశారు. తన పార్టీ జనసేన విధివిధానాలు చెప్పకుండా టీడీపీపై విమర్శలు చేయడం సరికాదని జవహర్ అన్నారు.