ఇకపై మరింత స్పష్టంగా కనిపించే శ్రీ వెంకటేశ్వరుడు
- గర్భగుడిలో దీపాల కాంతి పెంపు
- ఒత్తుల పరిమాణాన్ని పెంచాలని నిర్ణయం
- ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న భక్తులు
ఆగమ శాస్త్రాల ప్రకారం, గర్భగుడిలో విద్యత్ దీపాలను వెలిగించరాదన్న సంగతి తెలిసిందే. అందువల్లే అనాదిగా నేతి దీపాల వెలుగులోనే స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఇద్దరు ఏకాంగులు దీపకాంతిని తగ్గకుండా చూస్తుంటారు. వేలాడదీసిన రెండు దీపకుందీలతో పాటు కిందివైపు మరో రెండు కుందీల్లో వెలిగే దీపాల కాంతి నడుమే స్వామిని దర్శించుకోవాలి. వీటి వెలుగులను పెంచడంతో జయవిజయుల విగ్రహాల వద్ద నుంచి కూడా స్వామి స్పష్టంగా కనిపిస్తున్నారని భక్తులు ఆనందాన్ని వక్తం చేశారు.