మైనర్ కొడుకులకు బండ్లు ఇచ్చిన 55 మంది తండ్రులకు జైలు శిక్ష!
- నెల రోజుల వ్యవధిలో 1,079 చార్జ్ షీట్లు
- ఒకటి నుంచి రెండు రోజుల శిక్ష విధింపు
- మైనర్ డ్రైవింగ్ తీవ్ర నేరమంటున్న పోలీసులు
ఇదే సమయంలో టోలీచౌకీ పరిధిలో ఎలాంటి పత్రాలు, లైసెన్స్ లేకుండా వేగంగా వెళుతూ పట్టుబడిన మైనర్ కు ఒకరోజు జైలు శిక్ష కూడా పడింది. ఇలా మైనర్ కు జైలు శిక్ష పడటం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే మొదటిది. అతడిని జువైనల్ హోమ్ కు తరలించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. మూడో కేటగిరీ నేరం... అంటే వాహన చోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికి కూడా ముప్పు తెప్పించే నేరాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామని, మైనర్ డ్రైవింగ్ ఇదే కోటా కిందకు వస్తుందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.