West Godavari District: నదిలోకి జారిపడ్డ అమ్మాయి.. ఆమెను కాపాడబోయిన స్నేహితురాలు మృతి!

షార్ట్స్‌లో చూడండి
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి చెందిన డిగ్రీ ఫ‌స్టియ‌ర్ విద్యార్థిని సాయిరమ్య త‌న స్నేహితురాళ్ల‌తో స‌రదాగా గోదావ‌రి వ‌ద్ద‌కు వెళ్లి, న‌దిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, గూటాల పంచాయతీ కొత్త పట్టిసీమ గ్రామం వద్ద గోదావరిలో స్నానం చేయ‌డానికి సాయిరమ్య త‌న‌ స్నేహితురాళ్ల‌యిన శ్రీవల్లి, గూడపాటి సాయిభవాని, ప్రత్యూషలతో కలిసి వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో న‌దిలోకి దిగిన సాయిభవాని తలపై నీళ్లు చల్లుకునేందుకు ప్ర‌య‌త్నించింది. అయితే, ఆమె నిలబడిన రాళ్లు నాచుపట్టి ఉండటంతో ఒక్క‌సారిగా కాలుజారిపడింది. ఈ విష‌యాన్ని గుర్తించిన సాయిరమ్య ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా, ఇద్దరూ నదిలో మునిగిపోయారు. అక్క‌డ ఉన్న కొంద‌రు యువకులు సాయిభవానీని కాపాడగా, సాయిరమ్య మాత్రం న‌దిలో మునిగిపోయి మృతి చెందింది.   
Go Back to Shorts
West Godavari District
girl
died

More Telugu News