ఈ నెల 18న జమ్ముకశ్మీర్‌లో ఢిల్లీకి చెందిన ఐపీఎస్ అధికారి సమీర్‌శర్మని వివాహం చేసుకున్న వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి వెడ్డింగ్ రిసెప్షన్ నిన్న సాయంత్రం వరంగల్‌లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైభవోపేతంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ నేతలు, జిల్లా అధికారులు, ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భద్రకాళీ అమ్మ వారి టెంపుల్ లో పూజలు నిర్వహించారు.