కృష్ణాజిల్లా పెనమలూరులో నడిరోడ్డుపై విద్యార్థుల ఘర్షణ.. భయపడ్డ స్థానికులు
- కృష్ణాజిల్లా పెనమలూరులో ఘటన
- పోలీస్ స్టేషన్ ఎదురుగానే రెచ్చిపోయిన యువకులు
- మీడియాపై కూడా దాడి
ఇళ్లల్లోంచి బయటకు రావడానికి కూడా భయపడ్డారు. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. అంతేకాదు, అక్కడకు చేరుకున్న మీడియాపై కూడా దాడికి దిగారు. ఈ దాడిలో ఓ కెమెరా ధ్వంసం అయింది. ఇద్దరు విలేకరులకు గాయాలయినట్లు తెలిసింది. ఇంత జరుగుతున్నా పోలీసులు స్టేషన్ నుంచి బయటకు రాలేదు. ఓ విద్యార్థి హాస్టల్ నిర్వాహకులకు డబ్బులు ఇవ్వాల్సి ఉండడంతో ఆ విద్యార్థిని హాస్టల్ నిర్వాహకులు చితక్కొట్టడంతో ఈ వివాదం మొదలైనట్లు తెలిసింది.