global corruption index: అవినీతి దేశాల్లో మన తాజా ర్యాంకు 81... రెండు స్థానాలు కిందకు

షార్ట్స్‌లో చూడండి
ప్రపంచ దేశాల్లో అవినీతి పరంగా భారత్ రెండు స్థానాలు కిందకు జారింది. 2016లో 176 దేశాల జాబితాలో 79వ స్థానంలో ఉన్న భారత్ 2017 ప్రపంచ అవినీతి సూచీలో 81వ స్థానానికి వెళ్లిపోయింది. ఈ సారి 180 దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వివరాలను బెర్లిన్ కేంద్రంగా పనిచేసే ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసింది. లంచాలు, మీడియా స్వేచ్ఛ విషయంలో భారత్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే దారుణ స్థితిలో ఉన్నట్టు ఈ సంస్థ ప్రకటించడం గమనార్హం. భారత్, పిలిప్సీన్స్, మాల్దీవుల్లో జర్నలిస్టులు, ఉద్యమకారులు, ప్రతిపక్ష నేతలు, దర్యాప్తు సంస్థల ఉద్యోగులను బెదిరించడం, కొన్ని సందర్భాల్లో చంపడం వంటి పరిస్థితులున్నట్టు పేర్కొంది.

ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ అవినీతికి 1 నుంచి 100 వరకు స్కోరు కేటాయించింది. 0 అనేది అత్యంత అవినీతికి నిదర్శనం. 100 అనేది ఈ విషయంలో అత్యంత మెరుగైన స్థానానికి కొలమానం. భారత్ స్కోరు 40. గతేడాదితో పోలిస్తే ఏ మాత్రం మారలేదు. 2015లో మాత్రం 38. న్యూజిలాండ్, డెన్మార్క్ 89, 88 స్థానాలతో మెరుగైన స్థితిలో ఉన్నాయి. సిరియా, దక్షిణ సూడాన్, సోమాలియాలో అవినీతి దారుణంగా ఉంది. వీటి స్కోరు వరుసగా 14, 12, 9 గా ఉంది. చైనా స్కోరు 41.
Go Back to Shorts
global corruption index

More Telugu News