ఓసారి మోటార్ సైకిల్ చెయిన్ తో ఒకరిని ఉతికేశా!: రేణుకాచౌదరి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓసారి మోటార్ సైకిల్ చెయిన్ తో ఒకరిని ఉతికేశా!: రేణుకాచౌదరి

  • కాలేజీ రోజులను గుర్తుచేసుకున్న కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి
  • పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తే మోటార్ సైకిల్ చైన్ తో ఒకరిని ఉతికినా
  • అప్పటి నుంచి, నేనేంటో అందరికీ బాగా తెలిసింది
కాలేజీ రోజుల్లో ఓ సారి మోటార్ సైకిల్ చెయిన్ తో  ఒకరిని ఉతికానంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారని, వాళ్లతో నెగ్గుకు రావాలని అన్నారు.

‘కాలేజీ రోజుల్లో అబ్బాయిలు మీ దగ్గరకు రావాలన్నా భయపడి ఉండేవాళ్లేమో’ అనే ప్రశ్నకు రేణుకా చౌదరి స్పందిస్తూ, ‘అవును..  నేను మోటార్ సైకిల్ నడుపుతాను. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తే.. ఓ సారి మోటార్ సైకిల్ చైన్ తో ఒకరిని ఉతికినా! అప్పటి నుంచి, అందరికీ నేనేంటో బాగా తెలుసు. నేను ఎవర్నైనా చావ కొడుతుంటే, ఆటోవాళ్లూ, వేరే వాళ్లు కూడా వచ్చి హెల్ప్ చేేస్తుండే వాళ్లు. అసలు విషయమేంటో కూడా తెలుసుకోకుండానే వచ్చేసి హెల్ప్ చేసే వాళ్లు!’ అంటూ నవ్వులు చిందించారు.

ప్రస్తుతం, సామాజిక మాధ్యమాల్లో పలువురు చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉంటున్నాయని, ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.
renuka chowdary
cong

More Telugu News