బెంగళూరులోని 'బిగ్ బాస్' స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బెంగళూరులోని 'బిగ్ బాస్' స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం

  • బెంగళూరు ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీలో సెట్
  • షార్ట్ సర్క్యూట్ తో మంటలు
  • అగ్నికి ఆహుతైన భారీ సెట్టింగులు
టీవీ చానల్ రియాల్టీ షో బిగ్ బాస్ స్టూడియోలో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బెంగళూరు ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీలో అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో భారీ సెట్టింగులు అగ్నికి ఆహుతయ్యాయి. అక్కడ ఉన్న కార్మికులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాంక్రీటు వాడకుండా మౌల్డింగ్ విధానంలో నిర్మించిన తాత్కాలిక సెట్ కావడంతో ఏమీ మిగల్లేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Banglore
Big Boss
Firing

More Telugu News