delhi metro: ఢిల్లీ మెట్రోలో పురుషుల పర్సులను చాకచక్యంగా కొట్టేస్తున్న మహిళా ముఠాలు!

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీ మెట్రో రైలులో రద్దీగా ఉండే సమయాల్లో మహిళా ముఠాలు చోరీలకు పాల్పడుతున్నాయి. ఉన్నట్టుండి చిత్రంగా ప్రవర్తిస్తూ, ఏదో అయిపోతున్నట్టు భ్రమ కల్పిస్తారు. సాయం చేద్దామని వచ్చి పట్టుకున్న పురుషుల జేబుల్లోని వ్యాలెట్లను అంతలోనే సదరు మహిళలు కాజేస్తారు. అలాగని వీరు ఒంటరి మహిళలనూ వదలడం లేదు. చేతిలో బేబీతో వెళ్లి వారి పక్కన కూర్చుంటారు.

పాలిస్తూ పాపను నిద్ర పుచ్చుతున్నామని చెప్పి తమపై, బేబీపై కవరయ్యేలా వస్త్రాన్ని కప్పుకుంటారు. ఈ వస్త్రమే పక్కనే కూర్చున్న మరో మహిళ బ్యాగ్ పైనా పడుతుంది. అదే సమయంలో చిన్నగా ఆ బ్యాగు నుంచి విలువైనని కాజేస్తారు. ఇందుకు సంబంధించిన ముఠాను తాజాగా అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.25 లక్షల విలువైన వజ్రాభరణాలు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Go Back to Shorts
delhi metro

More Telugu News