హస్తానికి ఓటేస్తే మీకు రిక్తహస్తాలే : బీజేపీ నేత యశోధర రాజే వివాదాస్పద వ్యాఖ్యలు
- ఎన్నికల ప్రచారంలో బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన కాంగ్రెస్
- వచ్చే వారంలో కొలారస్ సీటుకు ఉప ఎన్నికలు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఓటర్లు కమలం గుర్తును కాదని హస్తం గుర్తుకు ఓటేస్తే, కొత్తగా ప్రవేశపెట్టిన 'ప్రధానమంత్రి ఉజ్వల యోజన' పథకం ఫలాలు దక్కవని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆమె ఓటర్లను భయపెట్టారంటూ విపక్ష కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు మంత్రి యశోధరా రాజేపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమె వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమే అవుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ యాదవ్ అన్నారు.