రైల్లో తత్కాల్ ప్రయాణికుల నిబంధనల సడలింపు... షరతులతో ఫుల్ రిఫండ్ కూడా!
- టికెట్ రద్దు చేసుకుంటే షరతులకు లోబడి పూర్తి రిఫండ్
- రైలు మూడు గంటలు ఆలస్యమైతే పూర్తి చెల్లింపు
- దారి మళ్లించినా కూడా రిఫండ్
ఆ స్టేషన్ కు రాకుండా రైలును మరో దారిలో మళ్లించినప్పుడు తత్కాల్ టికెట్ పై పూర్తి రిఫండ్ లభిస్తుంది. ప్రయాణికులు ఎక్కాల్సిన కోచ్ ను అధికారులు అనుసంధానించకున్నా కూడా రిఫండ్ లభిస్తుంది. ఏసీ క్లాసులో రిజర్వేషన్ చేయించుకుని, లోయర్ క్లాసులో టికెట్ కన్ఫర్మ్ అయి, ప్రయాణించడం ఇష్టం లేకున్నా కూడా పూర్తి రిఫండ్ లభిస్తుంది. ఒకవేళ లోయర్ క్లాసులో ప్రయాణించేందుకు అంగీకరించిన ప్రయాణికుడికి ఆ వ్యత్యాసాన్ని రైల్వే శాఖ వెనక్కు తిరిగి ఇచ్చేస్తుంది.