సరదాగా గడుపుతుండగా విషాదం .. రేసింగ్ కారులో జడ పడి మహిళ మృతి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సరదాగా గడుపుతుండగా విషాదం .. రేసింగ్ కారులో జడ పడి మహిళ మృతి!

  • హర్యానాలో జరిగిన సంఘటన
  • గో-కార్ట్ లో తిరుగుతుండగా ఊడిన జడ ముడి
  • వెనుక చక్రాల్లో పడి చుట్టుకుపోయిన వైనం
  • జుట్టుతో కూడిన చర్మం ఊడి వచ్చేసింది 
సరదాగా గడిపేందుకు అమ్యూజ్ మెంట్ పార్కుకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. హర్యానాలోని భాటిండాలో పునీత్ కౌర్ (28) కుటుంబం నివసిస్తోంది. హాలిడే ట్రిప్ లో ఉన్న ఈ కుటుంబం పర్వానూలోని టింబర్ ట్రెయిల్ నుంచి భాటిండాకు నిన్న తిరిగి వెళ్తూ, మార్గమధ్యంలో పింజోర్ గార్డెన్స్ లో ఆగారు. అక్కడి అమ్యూజ్ మెంట్ పార్కుకు తన భర్త అమర్ దీప్ సింగ్, రెండేళ్ల కొడుకుతో పాటు తమ బంధువులతో కలిసి పునీత్ కౌర్  వెళ్లింది.

తమ కుటుంబంలోని మొత్తం ఆరుగురు సభ్యులకు నాలుగు గో-కార్ట్స్ (రేసింగ్ కార్లు) బుక్ చేశారు. పునీత్ కౌర్ తన భర్త అమర్ దీప్ సింగ్ లు ఒక గో-కార్ట్ లో, వారి కుమారుడు, గ్రాండ్ మదర్ మరో గో-కార్ట్ లో కూర్చున్నారు. అందరూ హెల్మెట్లు ధరించారు. మొదటి రౌండ్ పూర్తి కాబోతున్న సమయంలో కౌర్ తల జుట్టు (జడ ముడి ఊడిపోవడంతో) గో-కార్ట్ వెనుక చక్రాల్లో పడటం.. దానికి చుట్టుకుపోవడం క్షణాల్లో జరిగిపోయింది. దీంతో, ఆమె జుట్టుతో కూడిన చర్మం తల నుంచి ఊడిపోయి వెనుక చక్రంలో ఇరుక్కుపోయింది.

వెంటనే , ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అమ్యూజ్ మెంట్ పార్కు యాజమాన్యంపై కేసు నమోదు చేయాలంటూ పునీత్ కౌర్ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. గో-కార్టింగ్ కు వచ్చే వారికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగానే చెబుతామని, ఈ సంఘటన అకస్మాత్తుగా జరిగిందని పార్కు యాజమాన్యం తెలిపింది.
haryana
punith kaur
racing car

More Telugu News