balakrishna: 'జై సింహా' మొత్తం వసూళ్లు ఇవిగో!

షార్ట్స్‌లో చూడండి
మొదటి నుంచి కూడా బాలకృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. సంక్రాంతికి తన సినిమా విడుదలైతే తప్పకుండా హిట్ దక్కుతుందని ఆయన భావిస్తుంటారు. అందువలన సాధ్యమైనంత వరకూ సంక్రాంతికి తన సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వుంటారు. అలా ఈ సంక్రాంతికి ఆయన 'జై సింహా' థియేటర్స్ లో వుండేలా చూసుకున్నారు.

కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా, భారీ వసూళ్లను సాధించింది. బాలకృష్ణ సరసన నయనతార .. నటాషా దోషి .. హరిప్రియ నటించిన ఈ సినిమా మొత్తం వసూళ్లను పరిశీలిస్తే, ఒక్క తెలంగాణలోనే 5.25 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 28.25 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 35.85 కోట్ల షేర్ ను సాధించింది. మొత్తానికి బాలకృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ మరోసారి కలిసొచ్చిందన్న మాట.      
Go Back to Shorts
balakrishna
nayanatara

More Telugu News