ola: జట్టుకట్టిన ఓలా, హైక్... హైక్ యాప్ నుంచే ఓలా సేవలు

షార్ట్స్‌లో చూడండి
దేశీయ మెస్సేజింగ్ యాప్ హైక్, క్యాబ్ సేవల సంస్థ ఓలా మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో హైక్ యూజర్లు ఓలా సేవలను సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 110 పట్టణాల్లో హైక్ యాప్ నుంచే ఓలా క్యాబ్ లను బుక్ చేసుకోవడం సాధ్యమవుతుందని ఇరు సంస్థలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

ఈ సేవల కోసం హైక్ యూజర్లు ‘మి’ ట్యాబ్ ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత ఓలాను సెలక్ట్ చేసి సేవలు పొందొచ్చు. హైక్ వ్యాలెట్ నుంచే క్యాబ్ చార్జీలు కూడా చెల్లించొచ్చు. అదనంగా హైక్ వ్యాలెట్ నుంచి బస్ టికెట్ల బుకింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, డీటీహెచ్ తదితర బిల్లుల చెల్లింపులు కూడా చేసుకునే వీలుంది.
Go Back to Shorts
ola
hike

More Telugu News