Sunny Leone: నరదిష్టిని అడ్డుకుంటున్న సన్నీలియోన్.. పంటలకు కాపుగా శృంగారతార ఫొటోలు!

షార్ట్స్‌లో చూడండి
నరదిష్టి.. ఇది చాలా డేంజర్ అనేది చాలామంది నమ్మకం. నరదిష్టికి నల్లరాయి కూడా మాడిమసైపోతుందని చెబుతారు. ఇక ఇటువంటి వాటిని తాము ఏమాత్రం నమ్మబోమని చెప్పే వారు కూడా ఇళ్లలో దిష్టి యంత్రాలు పెడుతుంటారు. ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే.. నరదిష్టి నుంచి తమ పంటలను కాపాడుకోవడానికి రైతులు వినూత్నంగా ఆలోచించారు. బాలీవుడ్ శృంగారతార సన్నీలియోన్ ఫొటోలను పొలం వద్ద ఏర్పాటు చేసి దారినపోయే వారి దృష్టిని అటువైపు మరల్చారు.

శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా దుత్తలూరు మండలం బండకిందపల్లి, బ్రహ్మేశ్వరం గ్రామాల రైతులు బెండ, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి పంటలను సాగుచేస్తున్నారు. మొక్కలు పచ్చగా ఎదిగి ఆకర్షణీయంగా ఉండడంతో దారిన పోయే వారు అటువైపు చూడకుండా ఉండలేకపోతున్నారు. బాటసారుల దృష్టి మొత్తం తమ పంటలపైనే ఉండడంతో దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెందిన రైతులు.. వారి దృష్టిని పంటల మీది నుంచి మళ్లించేందుకు పొలం గట్లపై పై సన్నీలియోన్ అర్ధనగ్న బ్యానర్లను ఏర్పాటు చేశారు.

అక్కడితో ఆగిపోలేదు.. ‘ఒరేయ్, నన్ను చూసి ఏడవకురా’ అని కింద స్లోగన్ కూడా రాయించారు. ఇప్పుడీ బ్యానర్లు హాట్ టాపిక్ అయ్యాయి. మిగతా రైతులు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఎవరో ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వార్త వైరల్ అయింది.
Go Back to Shorts
Sunny Leone
Bollywood
Nellore
crops

More Telugu News