ఏపీ విషయంలో కేంద్రం ఎందుకిలా వ్యవహరిస్తోందో.. అసంతృప్తి వ్యక్తం చేసిన అద్వానీ!
- టీడీపీ ఎంపీలతో పది నిమిషాలపాటు భేటీ
- విభజన సమస్యలు, లోక్‌సభలో పరిణామాలను వివరించిన ఎంపీలు
- ఏపీకి న్యాయం చేయాల్సిందేనన్న సీనియర్ నేత
అనంతరం అద్వానీ మాట్లాడుతూ ఏపీకి అన్యాయం జరిగిందన్నది వాస్తవమేనని, విభజన ఇబ్బందులతో బాధపడుతున్న ఏపీకి న్యాయం చేయాల్సిందేనని అన్నట్టు తెలిసింది. అలాగే సభా మర్యాదలకు ఇబ్బంది కలగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా సభ్యులపై ఉందన్నారు. ఏపీ వ్యవహారంపై మంత్రి అరుణ్ జైట్లీతో తాను మాట్లాడినట్టు అద్వానీ తెలిపారు. అయితే ఏపీ విషయంలో ఎందుకిలా వ్యవహరిస్తున్నారో మాత్రం తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.