Telangana: కొత్త పాస్ పుస్తకంపై రైతు ఫొటో తప్ప, మరెవ్వరి ఫొటో వద్దు: సీఎం కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలోని రైతులకు ఇచ్చే పాసు పుస్తకాలపై తన ఫొటో ముద్రించవద్దని సంబంధింత అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతులకు కొత్తగా ఇచ్చే పాస్ పుస్తకాల నమూనాలను కేసీఆర్ కు అధికారులు చూపించారు. ఈరోజు ప్రగతిభవన్ లో ఆయన్ని కలిసిన అధికారులకు ఈ మేరకు కొన్ని సూచనలు చేశారు. పంటలకు గుర్తుగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే పాస్ పుస్తకాన్ని ఆయన ఎంపిక చేశారు.

పాస్ బుక్ లో సీఎం కేసీఆర్ ఫొటో ఉన్న నమూనాలను కూడా ఆయనకు అధికారులు చూపించారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ, పాస్ పుస్తకంపై రైతు ఫొటో తప్ప, మరెవ్వరి ఫొటో వద్దని, రాజకీయ నాయకుల ఫొటోలు అవసరం లేదని అన్నారు. పాస్ పుస్తకంపై సంబంధిత రైతు ఫొటో, తెలంగాణ ప్రభుత్వం ముద్ర మాత్రమే ఉండాలని కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. 
Go Back to Shorts
Telangana
KCR
pass book

More Telugu News