ప్రభాస్ సరసన పూజా హెగ్డేకి ఛాన్స్ దక్కేసినట్టే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ సరసన పూజా హెగ్డేకి ఛాన్స్ దక్కేసినట్టే!

  • మహేశ్ - వంశీ పైడిపల్లి సినిమాలో పూజా హెగ్డే 
  • ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీలోను ఆమెనే నాయిక 
  • ప్రభాస్ నెక్స్ట్ మూవీలోనూ ఆమెకే ఛాన్స్
'దువ్వాడ జగన్నాథమ్' సినిమాలో పూజా హెగ్డే అందాల ఆరబోత చూసిన వాళ్లంతా, ఈ సుందరికి వరుస అవకాశాలు వెతుక్కుంటూ రావడం ఖాయమని అనుకున్నారు. అనుకున్నట్టుగానే స్టార్ హీరోల సరసన అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు వెళుతోంది. మహేశ్ బాబు 25వ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయనున్న సినిమాలోను పూజా హెగ్డేనే ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ సరసన కూడా పూజా హెగ్డే కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన కృష్ణంరాజు నిర్మాణంలో .. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం పూజా హెగ్డేను సంప్రదిస్తున్నారట. ప్రభాస్ జోడీగా చేయమంటే ఎవరు కాదంటారు? అందుకే ఆమె ఎంపిక ఖరారైపోయినట్టేనని అంటున్నారు.  
prabhas
pooja hegde

More Telugu News