Andhra Pradesh: టీడీపీ ప్రభుత్వానికి పని తక్కువ.. ప్రచార ఆర్భాటాలు ఎక్కువ: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేతపై గుంటూరు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజల డబ్బును వృథాగా ఖర్చు చేస్తున్నారని, అనవసర ఖర్చులతో ఏపీని అప్పులు పాలు చేస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వానికి పని తక్కువ, ప్రచార ఆర్భాటాలు ఎక్కువని విమర్శించారు. అమరావతి రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,500 కోట్లతో ఏయే నిర్మాణాలు చేపట్టారో చెప్పాలని ప్రశ్నించారు. ఇచ్చిన సొమ్ముకు లెక్కలు చూపని ఏపీ ప్రభుత్వం, కనీసం డీపీఆర్ కూడా ఇవ్వలేదని, పైగా నిధులు ఇవ్వమని కేంద్రాన్ని కోరుతోందని విమర్శించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
BJP
kanna

More Telugu News