charan: 'రంగస్థలం' ఆడియో ఫంక్షన్ లో ఆటాపాట .. పాతిక లక్షలు అడిగిన దేవిశ్రీ?

షార్ట్స్‌లో చూడండి
చరణ్ .. సమంత జంటగా సుకుమార్ 'రంగస్థలం' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరిదశకి చేరుకోవడంతో, త్వరలో ఆడియో ఫంక్షన్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ బాణీలను అందించాడు. అందువలన ఆడియో ఫంక్షన్లో స్టేజ్ పై ఆటాపాటలతో సందడి చేయవలసిందిగా దేవిశ్రీ ప్రసాద్ ను నిర్మాతలు కోరారట.

తాను సంగీతాన్ని అందించిన సినిమాల ఆడియో ఫంక్షన్స్ లో, స్టేజ్ పై ఆటాపాటలతో దేవిశ్రీ సందడి చేసేవాడు. అది ఆయా ఫంక్షన్స్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కూడా. అయితే ఇటీవల కాలంలో దేవిశ్రీ విదేశాల్లో స్టేజ్ షోలు ఇస్తూ వస్తున్నాడు. అందువలన ఈ విషయంలో ఆయనకంటూ ఒక మార్కెట్ ఏర్పడింది. అప్పటి నుంచి ఆయన ఫ్రీగా స్టేజ్ లపై హడావిడి చేయడం మానేశాడు. ఈ కారణంగానే 'రంగస్థలం' ఆడియో ఫంక్షన్లో స్టేజ్ పై ఆడిపాడాలంటే పాతిక లక్షలు ఇవ్వాల్సిందేనని ఆయన తేల్చి చెప్పాడట. దాంతో నిర్మాతలు ఆలోచనలో పడినట్టుగా ఫిల్మ్ నగర్ టాక్.  
Go Back to Shorts
charan
samanta

More Telugu News