మీరు సెన్సేషనల్ డైరెక్టర్ అవుతారని ఆనాడే రాజమౌళికి చెప్పాను!: భానుచందర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీరు సెన్సేషనల్ డైరెక్టర్ అవుతారని ఆనాడే రాజమౌళికి చెప్పాను!: భానుచందర్

  • నేను చిన్న దర్శకుల సినిమాల్లో చేస్తోన్న మాట నిజమే
  • ఒకప్పుడు రాజమౌళి కూడా చిన్న దర్శకుడే 
  • ఆయన ఇంత పెద్ద దర్శకుడు అవుతాడని ఎవరు ఊహించారు?
ఇటీవల కాలంలో చిన్న దర్శకుల సినిమాల్లో చేయడానికి కూడా ఎందుకు వెనుకాడటం లేదు? అనే ప్రశ్న భానుచందర్ కి ఐడ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఎదురైంది. అప్పుడాయన స్పందిస్తూ .. "ఒకప్పుడు రాజమౌళి 'శాంతినివాసం' అనే సీరియల్ చేశారు .. అప్పుడాయన చిన్న డైరెక్టరే. అదే రాజమౌళి 'బాహుబలి' తీస్తాడని .. ఇంత గొప్ప దర్శకుడు అవుతాడని ఎవరైనా ఊహించారా?" అని భానుచందర్ అన్నారు.

"రాజమౌళి దర్శకత్వంలో నేను 'సింహాద్రి' సినిమా చేశాను. 'సింహాద్రి ' సినిమాకి నేను డబ్బింగ్ చెప్పడం పూర్తి కాగానే, 'రాజమౌళి'ని పిలిపించండి అన్నాను. వెంటనే ఆయన అక్కడికి వచ్చారు. 'ఏంటి సార్ పిలిపించారట' అన్నారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది .. మీరు సెన్సేషనల్ డైరెక్టర్ అవుతారు. ఆ రోజున నేను మీకు ఫోన్ చేస్తాను .. కానీ మీరు నాకు దొరకరు అన్నాను .. అలాగే జరిగింది" అంటూ చెప్పుకొచ్చారు .    
bhanuchandar

More Telugu News