charan: 'రంగస్థలం' బిజినెస్ విషయంలో చరణ్ నిర్ణయం!

షార్ట్స్‌లో చూడండి
స్టార్ హీరోల సినిమాలకి ఒక రేంజ్ లో బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఆ హీరోలకి గల క్రేజ్ ను బట్టి డిస్ట్రిబ్యూటర్లు పెద్దమొత్తం చెల్లించి ఏరియాల వారీగా హక్కులు కొంటుంటారు. ఆ సినిమాలు బాగా ఆడితే అధిక మొత్తంలో లాభాలు వస్తాయి .. లేదంటే వచ్చే నష్టాల తీవ్రత కూడా అంతే ఉంటుంది. దాంతో నష్ట పరిహారంగా ఎంతోకొంత ఇవ్వమంటూ దర్శక నిర్మాతలను .. హీరోలను ఇబ్బందిపెట్టే సంఘటనలు జరుగుతుంటాయి.

ఇలాంటి తలనొప్పులు లేకుండగా చరణ్ ఒక నిర్ణయం తీసుకున్నాడట. మార్కెట్ లో వున్న హైప్ ఆధారంగా .. అభిమానుల్లో వున్న క్రేజ్ కారణంగా ఎక్కువ ధరకు తన సినిమా ఏరియా హక్కులను నిర్ణయించవద్దని నిర్మాతలకు చెప్పాడట. ఎవరికీ నష్టం కలగని విధంగా 20 శాతం తక్కువకే తన సినిమాపై హక్కులు ఇచ్చేయమని అన్నాడట. ఏయే ఏరియాలలో ఎవరికి ఎంతకి అమ్మారనే వివరాలను డీల్ క్లోజ్ చేయడానికి ముందుగా తనకి చెప్పాలని అన్నట్టుగా సమాచారం. మార్చి 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.   
Go Back to Shorts
charan
samanta

More Telugu News