ఢిల్లీలో మరో ఘోరం.. స్కూల్ బాత్‌రూమ్‌లో విద్యార్థి మృతదేహం
- స్నేహితులే చంపినట్లు అనుమానం
- పోస్టుమార్టం రిపోర్టు వస్తే తెలుస్తుందంటోన్న పోలీసులు
- అనారోగ్యం కారణంగా మృతి చెందాడంటోన్న స్కూల్ యాజమాన్యం
- ఇది హత్యేనంటోన్న విద్యార్థి తల్లిదండ్రులు
సీసీటీవీ కెమెరాను పరిశీలించిన పోలీసులు.. తుషార్ కుమార్, మరో ముగ్గురు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు గుర్తించారు.తుషార్‌ను ఆ ముగ్గురు విద్యార్థులు చితక్కొట్టి, అనంతరం టాయిలెట్ వద్దకు తీసుకెళ్లి తుషార్‌ను పడేసినట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ.. తుషార్ అనారోగ్యం వల్లే మృతి చెందాడని చెబుతోంది.
తమ కుమారుడిది హత్యేనని కుమార్ తల్లిదండ్రులు అంటున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తుషార్ మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తుషార్ స్నేహితులను విచారిస్తున్నారు.