jiocoin: జియోకాయిన్ పై క్లారిటీ ఇచ్చిన రిలయన్స్!

షార్ట్స్‌లో చూడండి
సొంత క్రిప్టో కరెన్సీ జియోకాయిన్ ను రిలయన్స్ జియో త్వరలోనే లాంచ్ చేయబోతోందని... దాని కోసం ప్రత్యేకంగా ఓ యాప్ ను తీసుకురాబోతోందంటూ వార్తలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసింది. ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్ లో జియోకాయిన్ పేరుతో పలు యాప్ లు ప్రత్యక్షమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో, దీనిపై రిలయన్స్ జియో క్లారిటీ ఇచ్చింది. తాము ఎలాంటి యాప్ ను లాంచ్ చేయడం లేదని స్పష్టం చేసింది. మార్కెట్లో వస్తున్న రూమర్లను ఖండించింది. తాము ఎలాంటి యాప్ ను రూపొందించలేదనే విషయాన్ని ప్రజలకు, మీడియాకు తెలియజేస్తున్నామని ప్రకటన విడుదల చేసింది. జియోకాయిన్ పేరుతో వస్తున్న యాప్స్ అన్నీ నకిలీవే అని చెప్పింది. కొంత మంది యోగ్యత లేని వ్యక్తులు జియోకాయిన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని... ఈ విషయాన్ని తాము చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని తెలిపింది. 
Go Back to Shorts
jiocoin
jiocoin app
reliance jio

More Telugu News