Puri Jagannadh: మళ్లీ తనయుడితోనే పూరీ సినిమా!

షార్ట్స్‌లో చూడండి
పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ తో 'మెహబూబా' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమా తరువాత పూరీ సినిమా ఏ హీరోతో ఉండనుంది అనే ప్రశ్నకు .. చరణ్ పేరు ఎక్కువగా వినిపించింది.

అయితే పూరీ తదుపరి సినిమా మళ్లీ ఆకాశ్ తోనే వుండనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. ఆకాశ్ ను హీరోగా నిలబెట్టాలంటే ఆయనతో మరో సినిమా చేయవలసిన అవసరం ఉందని భావించిన పూరీ, అందుకు రంగాన్ని సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. 'మెహబూబా' రిలీజైన వెంటనే ఆయన నెక్స్ట్ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళతాడట. ఇక ఆ సినిమాలో కథానాయికగా ఎవరికి ఛాన్స్ దొరుకుతుందో చూడాలి.  
Go Back to Shorts
Puri Jagannadh
akash

More Telugu News