Pawan Kalyan: పార్టీలకు మద్దతుపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు: ఏపీ కాంగ్రెస్ నేత జీవీ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
పార్టీలకు మద్దతు ఇచ్చే విషయమై ‘జనసేన’ స్పష్టంగా లేదని ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి విమర్శించారు. ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ‘జనసేన’ ప్రజల్లోకి వచ్చి దాదాపు నాలుగేళ్లవుతుందని, ఇంకా పార్టీ నిర్మాణం పూర్తి కాలేదనే సాకుతో వారిని ప్రశ్నించొద్దనడం హాస్యాస్పదంగా ఉందని, పవన్ కల్యాణ్ అడగమంటే కొన్ని ప్రశ్నలు సంధించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్, ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘జనసేన’ పార్టీకి రాజ్యాంగం ప్రకారం గుర్తింపు రాకపోయినప్పటికీ ప్రజా క్షేత్రంలో గుర్తింపు పొందిందని, మళ్లీ కొత్తగా ప్రజల్లోకి వెళ్తానని పవన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Congress

More Telugu News