నివాసానికి భారత్ ఎంతో చౌక... ప్రపంచంలో రెండో స్థానం... బెర్ముడా ఎంతో ఖరీదైనది!
- ఇంటి అద్దెలు ఇక్కడే తక్కువ
- జీవించేందుకు చౌకైన మొదటి దేశం దక్షిణాఫ్రికా
- గో బ్యాంకింగ్ రేట్స్ సంస్థ ర్యాంకింగ్ లు
భారత్ లో కొనుగోలు శక్తి 20.9 శాతం తక్కువని, అద్దెలు 95.2 శాతం చౌక అని, గ్రోసరీ 74 శాతం తక్కువని, ఇతర ఉత్పత్తుల ధరలు సైతం 75 శాతం తక్కువని ఈ సంస్థ వెల్లడించింది. పొరుగున ఉన్న పాకిస్థాన్ (14), నేపాల్ (28), బంగ్లాదేశ్ (40) కంటే చాలా చౌకగా జీవించేందుకు అనుకూలంగా ఉన్నట్టు ఈ నివేదికలో పేర్కొంది. చాలా ఖరీదైన దేశాలను పరిశీలిస్తే ఘనా (108), స్విట్జర్లాండ్ (109), హాంగ్ కాంగ్ (110), బహమాస్ (111), బెర్ముడా 112వ స్థానాల్లో ఉన్నాయి.