కోటీశ్వరులైన అండర్-19 ఆటగాళ్లు.. కనీస ధర రూ.20 లక్షలు.. రికార్డు స్థాయిలో కొనుగోలు!
- అత్యధిక ధరకు అమ్ముడుపోయిన కమలేష్
- అండర్-19 జట్టు కెప్టెన్, వైస్ కెప్టెన్‌లకు కూడా భారీ రేటు
- విదేశీ ఆటగాళ్లు దీటుగా ధర
అండర్-19 జట్టు కెప్టెన్ పృథ్వీషాను ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. పృథ్వీ కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ పోటీ పడగా చివరికి రూ.1.2 కోట్లతో ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది. అండర్-19 జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసింది. వీరిద్దరి బేస్ ప్రైస్ రూ.20 లక్షలు కాగా కోటి రూపాయలకు పైగా పలకడం విశేషం.