భార్య పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరిచి పైశాచికం... అరెస్ట్ చేస్తారన్న భయంతో బ్యాంకు స్ట్రాంగ్ రూములో దాగి నాటకం!
- నిందితుడు బ్యాంకు మేనేజర్
- తప్పు అతనిదేనని తేల్చిన పోలీసులు
- భర్త ప్రవర్తనతో విసుగు చెందిన భార్య
- విడాకులకు దరఖాస్తు
ఈ క్రమంలో ఆమె పేరిట తప్పుడు ఫేస్ బుక్ ఖాతా సృష్టించగా, బాధితురాలికి అసభ్య సందేశాలు, అపరిచితుల నుంచి ఫోన్ కాల్స్ రావడం మొదలైంది. తన భర్తే దీనికి కారకుడన్న అనుమానంతో అతన్ని నిలదీసిన ఆమె, సైబర్ క్రైమ్ పోలీసులకూ ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీ అడ్రస్ ల ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు ఇదంతా సృజన్ నిర్వాకమేనని తేల్చారు.
దీంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు శ్రీకాకుళం వెళ్లిన పోలీసులను ముందుగానే గమనించి బ్యాంకు స్ట్రాంగ్ రూములో దాక్కున్నాడు సృజన్. ప్రశ్నించేందుకు వచ్చామని పోలీసులు చెప్పడంతో నాటకమాడాడు. తనకు గుండెనొప్పి వస్తోందని చెప్పాడు. ఇక అక్కడే తాముంటే అతను బయటకు రాడన్న భావనతో తాము వెళ్లిపోతున్నామని చెప్పి, అక్కడే మకాం వేశారు పోలీసులు. ఆపై మరో గంట తరువాత అతన్ని బయటకు రాగా, వెంటనే అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తెచ్చి కటకటాల వెనక్కు పంపారు. అప్పటికే భర్త ప్రవర్తనపై విరక్తితో ఉన్న ఆమె, విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది.