పిల్లలపై రాళ్లు విసిరారు.. ఇళ్లలోకి చొరబడుతున్నారు.. వీరిని వదిలేయకూడదు!: కర్ణిసేనపై కేజ్రీవాల్
- నిన్న గుర్గావ్‌లో ఘటన.. వీడియో వైరల్
- మొన్న ముస్లింలను చంపారు.. నిన్న దళితులను సజీవంగా తగులబెట్టారు
- విభజన శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి: కేజ్రీవాల్
ఇటువంటి ఘటనలను చూస్తూ ఉండకూడదని, దీనిపై అందరూ స్పందించాలని, విభజన శక్తులకు వ్యతిరేకంగా పోరాడడానికి ఇదే సరైన సమయమని అన్నారు. స్కూలు బస్సుపై రాళ్లు విసిరిన వారికి.. రావణుడికి రాముడు వేసిన శిక్ష కంటే పెద్ద శిక్ష వేయాలని వ్యాఖ్యానించారు. ఈ దాడి చేసిన వారు ఏ మతానికి చెందినవారని ప్రశ్నించారు. ఏ మతం పిల్లలపై హింసను సమర్థిస్తుందని నిలదీశారు.