charan: 'రంగస్థలం'లో సమంత మూగ అమ్మాయిగా కనిపించనుందా?

షార్ట్స్‌లో చూడండి
సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన రోజుల్లోనే, ఇందులో చరణ్ వినికిడి లోపం కలిగిన యువకుడిగా కనిపించనున్నాడనే టాక్ బయటికి వచ్చింది. అదే విధంగా కథానాయిక సమంత మూగ అమ్మాయిగా కనిపించనుందనే ప్రచారం కూడా భారీస్థాయిలోనే జరిగింది. ఇందులో నిజమెంత అనే విషయంలో నిన్నటివరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు.

 నిన్న విడుదలైన టీజర్ తో .. ఈ సినిమాలో చరణ్ పాత్రకి వినికిడి లోపం ఉందనే విషయం స్పష్టమైపోయింది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి సమంత పాత్రపై పడింది. చరణ్ పాత్ర విషయంలో బయటికి వచ్చిన వార్త నిజమైనట్టుగానే, సమంత మూగ అమ్మాయిగా కనిపించే విషయం కూడా నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకుంటున్నారు. సమంత పాత్ర ఎలా వుండనుందనేది త్వరలోనే తేలిపోనుంది. 
Go Back to Shorts
charan
samanta

More Telugu News