కొండగట్టు అంజన్న ఆలయానికి పవన్ విరాళం రూ.11 లక్షలు

  • ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటన
  • స్వామి వారికి ప్రత్యేక పూజలు
  • తనను చల్లగా చూడాలని కోరుకున్నట్టు తెలిపిన పవన్
కొండగట్టు ఆంజనేయ స్వామిని ఈ రోజు దర్శించుకున్న నటుడు పవన్ కల్యాణ్ ఆలయ అభివృద్ధి కోసం రూ.11 లక్షల విరాళాన్ని అందించారు. ఆలయ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ప్రకటించారు. కాగా, ఆలయ మర్యాదలతో పవన్ కల్యాణ్ కు పండితులు స్వాగతం పలికారు. అనంతరం  పవన్ కల్యాణ్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు పవన్ కల్యాణ్ ను ఆశీర్వదించారు. స్వామి తనను చల్లగా చూడాలని మొక్కుకున్నట్టు పవన్ కల్యాణ్ చెప్పారు. స్వామి ఆశీస్సులతోనే తాను 2009లో ప్రమాదం నుంచి బయటపడినట్టు పేర్కొన్నారు.
Go Back to Shorts
pavan kalyan
kondagattu

More Telugu News