ఇక వస్తున్నా... కీలక ప్రకటన చేసిన పవన్ కల్యాణ్!
- నా అప్రహిత రాజకీయ యాత్ర ఇక మొదలు
- కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభించనున్నాను
- మా కుటుంబ ఇల వేల్పు ఆంజనేయ స్వామి
- నా పర్యటన ప్రణాళికను కొండగట్టులో ప్రకటిస్తాను
సర్వమత ప్రార్థనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం, సమస్యలను అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడానికి ఈ యాత్ర ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నా పర్యటన ప్రణాళికను కొండగట్టులో ప్రకటిస్తాను' అని పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అంటూ ఆ దేవాలయ ఫొటోను కూడా పవన్ కల్యాణ్ పోస్ట్ చేయడం విశేషం.