యువతికి అసభ్య సందేశాలు.. హైదరాబాద్ లో జర్మన్ పౌరుడిపై నిర్భయ కేసు!
- పరిచయమైన యువతికి అసభ్య సందేశాలు
- వాట్స్ యాప్ ద్వారా పంపించిన జర్మనీ వ్యక్తి
- అరెస్ట్ గురించి తెలుసుకుని ముందే లొంగుబాటు
మెసేజ్ లు శ్రుతిమించుతుండటంతో, బాధితురాలు గత నెలలో పోలీసులను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు, మెసేజ్ లు న్యూమన్ నుంచే వస్తున్నట్టు తేల్చారు. అతనిపై నిర్భయ సెక్షన్ కింద క్రిమినల్ కేసును నమోదు చేశారు. ఇక నిందితుడు కూకట్ పల్లి దగ్గరలో ఉన్న లోధా టవర్స్ లో నివాసం ఉంటున్నట్టు గుర్తించిన పోలీసులు, అరెస్ట్ చేసేందుకు వెళ్లగా, ఆ విషయాన్ని అప్పటికే తెలుసుకున్న ఆయన, కోర్టులో లొంగిపోయి, బెయిల్ తీసుకున్నాడట. కేసును విచారిస్తున్నట్టు కూకట్ పల్లి పోలీసులు తెలిపారు.