Telugudesam: మోత్కుపల్లి 'టీఆర్ఎస్ లో విలీనం' వ్యాఖ్యలపై స్పందించిన ఎల్ రమణ!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తేనే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందన్న మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యలపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ స్పందించారు. మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని అభిప్రాయపడ్డ ఎల్ రమణ, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ తమ పార్టీలో అధికమని, ఎవరైనా మాట్లాడవచ్చని అన్నారు.

 ఈ ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎల్ రమణ మీడియాతో మాట్లాడారు. మోత్కుపల్లి వ్యాఖ్యలను తానేమీ సీరియస్ గా తీసుకోవడం లేదని, ఆయనతో మాట్లాడతానని అన్నారు. నేతలు పార్టీలు మారినా క్యాడర్ తమతో పాటే ఉందని చెప్పారు.
Go Back to Shorts
Telugudesam
NTR
Motkupalli Narsimhulu
L Ramana

More Telugu News