Chandrababu: గవర్నర్ మార్పుపై నేను స్పందించను: ముఖ్యమంత్రి చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
గవర్నర్ మార్పుపై తాను స్పందించబోనని, బీజేపీ ఎంపీ హరిబాబు రాసిన లేఖ వాళ్ల పార్టీకి సంబంధించిన అంశమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని చంద్రబాబు కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ... విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సుకు అరుణ్ జైట్లీని ఆహ్వానించానని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ, రెవెన్యూ లోటు భర్తీ అంశాలపై చర్చించానని  చెప్పారు. ఈఏపీ ద్వారా కాకుండా నాబార్డు, హడ్కో ద్వారా నిధులు ఇవ్వాలని కోరామని అన్నారు. రెవెన్యూ లోటు కింద ఆంధ్రప్రదేశ్‌కి ఇంకా నిధులు రావాల్సి ఉన్నాయని చెప్పారు.
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
haribabu

More Telugu News