balakrishna: 'జై సింహా' అయిదు రోజుల వసూళ్లు

షార్ట్స్‌లో చూడండి
బాలకృష్ణ 102వ సినిమాగా ఈ నెల 12వ తేదీన 'జై సింహా' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోను వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా బీసీ సెంటర్లలో బాలయ్య మార్క్ మాస్ మూవీగా తన సత్తా చాటుతోంది.

ఈ అయిదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 19.7 కోట్లను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 23.93 కోట్లను రాబట్టింది. ఇప్పట్లో పెద్ద సినిమాలేవీ లేవు కనుక, 'జై సింహా' సినిమా వసూళ్ల జోరు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. అందువలన మరికొన్ని రోజుల్లో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లో పడే అవకాశం ఉందని చెబుతున్నారు. బాలకృష్ణ సరసన నయనతారతో పాటు నటాషా దోషి .. హరిప్రియ నటించిన సంగతి తెలిసిందే.   
Go Back to Shorts
balakrishna
nayanatara

More Telugu News