చంద్రబాబే క్షమాపణలు చెప్పారు.. పవన్ చెప్పలేడా? బాబు కంటే పవన్ గొప్పోడా?: విరుచుకుపడిన కత్తి మహేశ్
పండుగ వరకు ప్రశాంతంగా ఉన్న సినీ క్రిటిక్ కత్తి మహేశ్ మంగళవారం ఓ టీవీ చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొని పవన్‌పై మరోమారు విరుచుకుపడ్డాడు. ఇంత జరుగుతున్నా పవన్ ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే పవన్ గొప్పోడు కాదని, మరి క్షమాపణలు చెప్పేందుకు ఆయనకు లేని అడ్డు ఈయనకే వచ్చిందా? అని నిలదీశాడు. తనవల్ల కలిగిన అసౌకర్యానికి స్వయంగా చంద్రబాబే ఓ సామాన్యుడికి క్షమాపణలు చెప్పారని గుర్తు చేశాడు.
పవన్ ఫ్యాన్స్‌తో జరుగుతున్న వివాదం తన ప్రాథమిక హక్కులకు సంబంధించినదని, అందుకే దీనిని విడిచిపెట్టడం లేదని కత్తి స్పష్టం చేశాడు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్.. ఇలా మనం ఎవరి గురించైనా మాట్లాడొచ్చని, కానీ పవన్ గురించి మాట్లాడితే మాత్రం దాడి చేస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘అంటే పవన్ అంత గొప్పోడా?’ అని ప్రశ్నించాడు. ప్రజాస్వామ్యానికి ఇది ఎంతమాత్రమూ మంచిది కాదని అన్నాడు. ఇది తన ఒక్కడి సమస్య కాదని, అందరిదీ అని కత్తి మహేశ్ పేర్కొన్నాడు.