mla: ‘వస్తున్నాడు.. వచ్చేస్తున్నాడు..మన అందరి ఆశాజ్యోతి, ఆంధ్రజ్యోతి, ఈనాడు...’ అంటూ ‘ఎంఎల్‌ఏ’ టీజర్‌ విడుదల

షార్ట్స్‌లో చూడండి
‘వస్తున్నాడు.. వచ్చేస్తున్నాడు..మన అందరి ఆశాజ్యోతి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ..’ అనే వాయిస్ ఓవర్ వినిపిస్తుండగా ‘ఎంఎల్ఏ’ చిత్రం హీరో నందమూరి కల్యాణ్ రామ్ టీజర్ లో కనబడతాడు. ఈరోజు భోగి పండగ సందర్భంగా ఈ చిత్రం టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఉపేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన కాజోల్ నటిస్తోంది.

 ‘తిప్పండి సార్ మీసం’ అని హాస్యనటుడు పృథ్వీరాజ్ అనడం,‘తగ్గించాం కదా రాజు గారూ’ అని కల్యాణ్ రామ్ బదులివ్వడం ఈ టీజర్ లో కనబడుతుంది. ‘పెట్టండి సార్ అద్దాలు’ అనే పృథ్వీ డైలాగ్ కు, ‘అదీ’ అంటూ కూలింగ్ గ్లాసెస్ ను కల్యాణ్ రామ్ ధరించి నడిచి వస్తుంటే పూల వర్షం కురవడం, ఈ దృశ్యాన్ని మీడియా కవర్ చేస్తుండటం ఆ టీజర్ లో కనపడుతుంది. దీంతో పాటు, చివర్లో ఓ యాక్షన్ సన్నివేశంలో కల్యాణ్ రామ్ కనపడే దృశ్యం ఆకట్టుకుంది. ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ అనే ట్యాగ్ లైగ్ ఉన్న‘ఎంఎల్ఏ’ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.


Go Back to Shorts
mla
nandamuri

More Telugu News