India: అండర్ 19 వరల్డ్ కప్... ఆస్ట్రేలియా ముందు 329 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇండియా!

షార్ట్స్‌లో చూడండి
అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా మౌంట్ మౌంగానుయ్ లో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత ఆటగాళ్లు భారీ స్కోరును చేశారు. ఓపెనర్లు పృధ్వీషా, మనోజ్ కల్రాలు రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 328 పరుగుల స్కోరును భారత్ చేసింది.

చివరి పది ఓవర్లలో భారత ఆటగాళ్లు 105 పరుగులు రాబట్టడం విశేషం. మన్ జ్యోత్ 86, పృధ్వీ షా 94, ఎస్ గిల్ 63 పరుగులు సాధించగా, చివర్లో అభిషేక్ 8 బంతుల్లో 23 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో ఎడ్వర్డ్స్ కు 4 వికెట్లు దక్కగా, ఉప్పల్, వాగ్, సుదర్ ల్యాండ్ లకు తలా ఒక వికెట్ దక్కింది. ఇక ఆసీస్ కుర్రాళ్లు ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే 329 పరుగులు చేయాల్సి వుంది.
Go Back to Shorts
India
Australia
U-19
World Cup

More Telugu News