dasari arunkumar: 'సరైనోడు'లో విలన్ గా నన్ను అడిగారనేది రూమరే: దాసరి అరుణ్ కుమార్

షార్ట్స్‌లో చూడండి
హీరోగాను .. ముఖ్యమైన పాత్రల్లోను తెలుగు తెరపై మెరిసిన దాసరి అరుణ్ కుమార్, ఆ తరువాత నుంచి సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే " 'సరైనోడు' సినిమాలో ఆది పినిశెట్టి చేసిన 'విలన్' పాత్రకు మిమ్మల్ని అనుకున్నారట .. నిజమేనా?" అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.

అప్పుడాయన స్పందిస్తూ .. 'అందులో నిజం లేదు .. అదంతా రూమరే' అని అన్నారు. 'ఆ సినిమాకి సంబంధించి నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఇక 'నిజం' సినిమాలోను గోపీచంద్ పాత్ర నేను చేయవలసిందనే ప్రచారం జరిగింది .. అందులో కూడా వాస్తవం లేదు. తేజ - కల్యాణ్ రామ్ కాంబినేషన్లో వచ్చిన 'లక్ష్మీ కల్యాణం'లో మాత్రం నేను విలన్ గా చేయవలసింది .. కానీ కొన్ని కారణాల వలన ఆ పాత్ర అజయ్ చేయడం జరిగింది' అని చెప్పుకొచ్చారు.         
Go Back to Shorts
dasari arunkumar

More Telugu News