కోహ్లీ బాటలో పాండ్యా... ఓ బాలీవుడ్ భామతో సహజీవనం!
- ఎల్లి అవ్రామ్ పేరు ప్రచారంలోకి
- సామాజిక మాధ్యమాల్లో వీరి సన్నిహిత ఫొటోలు
- పాండ్యా సోదరుడి వివాహానికీ హాజరు
బిగ్ బాస్7 సిరీస్ లో పాల్గొన్న ఎల్లి, కిస్కో ప్యార్ కరూన్, పోస్టర్ బాయ్స్ సహా పలు చిత్రాల్లో నటించింది. అలాగే, ప్రస్తుతం పలు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటిస్తోంది. గడిచిన డిసెంబర్ లో జరిగిన పాండ్యా సోదరుడు కృనాల్ వివాహానికి ఎల్లి హాజరు కావడం తెలిసిందే. అలాగే, పాండ్యా, ఎల్లి సన్నిహితంగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోనూ రావడంతో వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారన్న వార్తలకు బలాన్నిస్తున్నాయి. క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్కశర్మ చాలా కాలం సహజీవనం తర్వాత దాంపత్య జీవనంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.