గ్రామ్ పేరుతో క్రిప్టోకరెన్సీని ఆవిష్కరించబోతున్న టెలిగ్రామ్ యాప్
- టెలిగ్రామ్ ఓపెన్ నెట్వర్క్ ద్వారా లావాదేవీలు
- వర్చువల్ కరెన్సీ ద్వారానే చెల్లింపులు
- 180 మిలియన్ల యూజర్లకు కొత్త సదుపాయం
వాట్సాప్ తర్వాత అత్యంత ఎక్కువ మంది వాడుతున్న టెలిగ్రాం యాప్, ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తే ప్రపంచవ్యాప్తంగా 180 మిలియన్ల మంది వినియోగదారులు వర్చువల్ మార్కెట్ పరిధిలోకి వచ్చే సదుపాయం కలుగుతుంది. గ్రామ్ని త్వరలో ఆవిష్కరించేందుకు టెలిగ్రాం సన్నాహాలు చేస్తోంది. ఫోన్ కాంటాక్టు నెంబర్ల ద్వారా ఈ కరెన్సీ చెల్లింపులు జరగనున్నాయి.